నవ సమాజ నిర్మాణం-యడ్ల శ్రీనివాసరావు-విజయనగరం-Cell 9493707592

 పోరాడితే పోయేది ఏముంది
సమాజంలో కుళ్ళు తప్ప
పోరాడితే పోయేదేముంది
అవినీతిని వ్యతిరేకించడం తప్ప
పోరాడితే పోయేదేముంది
చెడుని అంతమొందించడం తప్ప
పోరాడితే పోయేదేముంది
అన్యాయం చేదించాలని
పోరాడితే పోయేదేముంది
మంచి నీ నిర్మించగలం
నవ సమాజం ని పునరుద్ధరించగలం
మన రాజ్యాంగం గర్వించగలదు
వ్యక్తిగ మన స్వేచ్ఛ పొందగలం
మన పౌర హక్కులు సాధించగలం
పొరుగు వారిని ఆదుకోగలం
మంచితనానికి పునాది వేయగలం
ఓ నవీన సమాజం మేలుకో
పోరాడితే సాధించగలం తెలుసుకో
ఇదే కవిగా నా నినాదం
ఒంటరి నిట్టూర్పు కాదు
నా కలం సంధిస్తాను
నా భావం కోస మెరుపు చేస్తాను
ఇదే నా నవీన సమాజ నిర్మాణం
అదే నా గాంధీ  కన్నా రాజ్యం స్వరాజ్యం
----------------------------------------
కామెంట్‌లు