పిల్లల పెంపకం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 బాల అన్న శబ్దానికి  పరవస్తు చిన్నయ సూరి చెప్పిన అర్థం వయసుతో సంబంధం లేదు  ధారణ సాధన కలిగిన వాడు మాత్రమే బాలుడు. ఉపాధ్యాయుడు ఏదైతే చెబుతాడో దానిని తన మెదడులో ధరించి  దానిని నిత్యం సాధన చేస్తూ ఉండేవాడిని బాలుడు అని నిర్వచించాడు. అలాంటి బాలలకు ఉపాధ్యాయుడు ఏం చెప్తాడో. బురదలో ఉంటుంది కలువ అందుకే దానిని పంకజం అంటారు పంకము నుంచి పుట్టినది అని అర్థం  దాని పుట్టుక  బురద నుంచి వచ్చిన అది ఎంతో పవిత్రంగా ఉంటుంది  అలాగే తేనెటీగలను మనం తీసుకున్నట్లయితే దానినిండా  విషం నిండి ఉంటుంది దాని తేనె అమృత  తుల్యం  శాశ్వతంగా ఉంటుంది  కానీ ఆరోగ్య లో గాని దానిని మించినది మరొక పదార్థం లేదు. మనకు గంజాయి మొక్క ఎట్లా ఉంటుందో తులసి మొక్క ఎలా ఉంటుందో  బాగా తెలుసు  ఆరోగ్యాన్ని పాడు చేసేది గంజాయి అయితే  జీవితానికి జీవాన్ని ఇచ్చేది తులసి  ప్రతి ఇంటిలోనూ ముందు  తులసి మొక్క పెట్టి ప్రతి గృహిణి ఉదయం లేవగానే దానికి పూజలు  చేస్తారు అంత పవిత్రమైన దైవ స్వరూపం  దాని ఆకు గాని  దాని గాలి కానీ  మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది  ఇది గంజాయి మొక్కలలో పెరిగినా దాని అస్తిత్వాన్ని కోల్పోదు. అలాగే బాలలు అనేకమంది బాలలతో తిరుగుతూ ఉంటారు  స్నేహితులుగా మిత్రులుగా నమ్మిస్తూ ఉంటారు కానీ వారి తత్వాలు తెలుసుకొని మంచివారైతే మంచిగా చెడ్డవారైతే వారికి దూరంగా మసులుకోవడం  ప్రతి బాలుడు నేర్చుకోవలసిన పాఠం  దానికోసం తల్లిదండ్రులే కాకుండా ఉపాధ్యాయులు కూడా సహకరించాలి. మనం కొంచెం నిద్ర మగతకు వెళ్లిన కలలు  వాటి అంతట అవే వస్తాయి  ఎలాంటివి వస్తాయి ఎందుకు వస్తాయి మనం చెప్పలేం  ఆ కల పూర్తిగా ఉదయం లేచిన తర్వాత జ్ఞాపకం ఉంటుందంటే  అది నమ్మకం లేని విషయం పోనీ నమ్మకం ఉండి దానిని అందుకోగలమా అంటే  అది కలగదా అన్న సమాధానమే మనకు మిగులుతుంది  ప్రత్యేకంగా యువతలో  ఊహా ప్రపంచంలో విహరించడం బాగా అలవాటు  అవుతుంది నూటికి 99 మందిలో  ఎన్ని ఊహలు తన మస్తిష్కంలో చోటుచేసుకుంటాయో చెప్పలేం  వాటన్నిటినీ జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమే  వాటిని అందుకోవడం మన పరిధిలో లేని విషయం  అందుకే మన పెద్దవారు ఊహలు వేరు నిజాలు వేరు  ఈ జీవితం నిజాలలో బ్రతకవలసినది అని మనకు పాఠ్యంగా చెబుతారుకామెంట్‌లు