పంచపది బసవ పురాణం;- కాటేగారు పాండురంగ విఠల్-పంచపది ప్రక్రియ రూపకర్త-హైదరాబాద్ 9440530763
 60
బసవన్న సంగమేశ్వరము చేరినాడు
ఆ పుణ్యస్థలిలో పాదము మోపినాడు
గురుస్థవంతో వందనమాచరించినాడు
పరమశివుడిని మదిలో ధ్యానించినాడు
సంగమేశ్వరాన్ని తీర్థరాజంగా భావించె విఠల!
61
సంగమేశ్వర ఏరులన్ని పుణ్యతీర్థాలే
అక్కడి గుహలన్ని శివుని నివాసాలే
అచటి గిరులన్ని కైలాస తుల్యములే
ఇక్కడి మహిళలందరూ పతివ్రతలే
దీని మహిమపొగుడ శేషుతరం కాదువిఠల!
62
ఇక్కడున్న చెట్లన్నీ రుద్రాక్ష వృక్షములే
ఇచటనున్న గనులన్ని విభూతి ఖనులే
ఇక్కడి ఆవులన్నియూ కామధేనువులే
సంగమేశ్వరపు వృషభాలన్ని నందీశ్వరులే
ఇచ్చటి పురుషులందరూ శివభక్తులే విఠల!ik
63
నిత్యం శివతత్వ మాటలే వినిపిస్తాయి
గీత సంగీత వాయిద్యాలు వినిపిస్తాయి
వేదపురాణ సూక్తులు వినిపిస్తుంటాయి
పంచాక్షరి ఘోసలు వినిపిస్తూ వుంటాయి
సంగమేశ్వర అణుఅణువు శివమయమే విఠల!
64
గురులింగమూర్తికి సాష్టాంగం ప్రణమిల్లాడు
కూడలిసంగమేశ్వర స్వామిని స్తుతించాడు
స్వామి జంగమ రూపుడిగా ప్రత్యక్షమయ్యాడు
బసవేశ్వరుడు పరమానందభరితుడయ్యాడు
కన్నీటితో గురువు పాదాలనభిషేకించెను విఠల!
65
సంగమేశ్వరుడు కొడుకును లేవనెత్తెను
అతన్ని కౌగిలించుకొని ప్రసాదమిచ్చెను
భక్తినితప్పి నడవకని హితబోధ చేసెను
శివభక్తులతో లోపాలను ఎంచవద్దనెను
శత్రువునైనా మిత్రునిగా చూడమనె విఠల!
66
వ్రతం ప్రాణాంతకమైనా విడువు వద్దు
శివ భక్తిలేని హీనులను సహించ వద్దు
భక్త ప్రసాదం కానిదాన్ని స్వీకరించవద్దు
జంగముడు నేను వేరని భావించ వద్దు
సంగమేశ్వరుడు బసవనికి బోధించె విఠల!
67
వేద-శాస్త్ర బోధిత భక్తిని ప్రచారం చేయుము
భక్తులు తిట్టినా కొట్టినా శరణుశరణనుము
పరస్త్రీలను సోదరీమణులుగా భావించుము
ఈశ్వరుని భక్తి వంచన లేనిదిగా గుర్తించుము
అన్నీ బోధించి సంగమేశ్వరుడదృశ్యమయ్యె విఠల!
68
నిత్యము శివుణ్ణి శ్రద్ధాభక్తితో స్తుతించుము
ఎట్టి కష్టంలోనైననూ మమ్ము స్మరించుము
సత్యమార్గమును ఎప్పటికి వదులకుము
అన్నిటికీ మించినది సుమధురభాషణము
గురు లింగమూర్తి బోధించి లింగైక్యమయ్యె విఠల!
69
భక్తులత్యంత ఆశ్చర్య చకితులయ్యారు
తాపసి రావడమదృశ్యమవడం చూశారు
శివుడే తాపసిగా వచ్చి వెళ్లాడని భావించారు
అతని కృపకు పాత్రుడయ్యాడని పొగిడారు
బసవడు ఆ గుడిలోనే వుండసాగెను విఠల!
70
లోగడ ఒక భక్తుడు భార్యను అర్పించాడు
ఇంకొక భక్తుడు కొడుకును నొప్పించాడు
మరొక భక్తుడేమో తన తండ్రినే చంపినాడు
ఒకరేమో భార్యనే శివునికి సమర్పించాడు
బసవడు శివున్నే రప్పించెననిరి భక్తులు విఠల!


కామెంట్‌లు