ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322
 కసిగా నీ చుట్టూ ఉన్న చెట్లపై కాచి ఉన్న నా వీర యోధులు  విల్లులు ఎక్కు పెట్టి సైనికుల వెనుక సర్వాధికారి వెనుక నిలిచి ఉన్నారు నా ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు.
వెంటనే చేతులెత్తి రాజు గారిని శరణు వేడారు అప్పుడు రాజు గారు నవ్వి శత్రువైన సరే  చేతులెత్తి శరణం అన్న వాడిని కాచి రక్షించే జాతి నాది  మాటకు చేతకు  భేదం లేని   జాతి నాది  మన మధ్య సంధి జరగదు  మన మధ్య సందు చూచి వేటు వేసే నీతి వెధవ నీతి నీది చెప్పి చేయడం చేసినదెల్లా చెప్పడం సత్యవ్రత నీతి మా జాతి  సొత్తు  మీరు పిలిచారు కనుక నేను వచ్చాను వీలు చూసి పారిపోవడానికి కాదు నేను ఇక్కడకు వచ్చినది  మీరేదో సంధి చేసి విషయానికి రాజీ పడతారని వచ్చాను తప్ప  పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళిపో  మీ వారందరినీ తీసుకొని  వెళ్ళు నేను అనుజ్ఞ ఇచ్చాను  అని భీకరంగా పలికిన రాజు గారి మాటలు విని  కాలం మనకు కలిసి రాలేదు అంటూ ధీన వదనాలతో  తిరిగి వెళ్లారు   కార్యశీలి మన అల్లూరి.
శరణన్న శత్రువును కూడా కాచి రక్షించడం నా ధర్మం  మా భారత జాతి నీతి అది చెప్పి చేయడంలో అందె వేసిన చేయి మేము  సత్య వ్రత నీతి మా జాతి సొత్తు  మీరు పిలిచినప్పుడు రాకపోతే  ఓటమిని అంగీకరిస్తుంది అన్న భావనతో  ఇక్కడకు వచ్చాము తప్ప  కలుషిత మనస్కులైన మీరు  నిజమైన సంచి కోసం కాదు కదా రమ్మన్నది  మా చరిత్రను చూసి గర్వించు  వెళ్ళిపో  అని చెప్పగానే వారు వెను తిరిగి ప్రాణాలు దక్కాయి అన్న తృప్తితో పారిపోవడం మొదలుపెట్టారు  వారి దీన వదనాలను చూసి రాజు  తన వారిని తీసుకొని రాజసంగా  బయలుదేరి తన వారి విడిది చేరాడు  అది రాజు  చూపిన   ధీరత్వం.గాము సోదరులలో గండర గండరు మల్లు దొర  మల్లుల కెల్లా  మేటి గుప్పెడు  మీసంతో  నిప్పులు రాలుతున్న కళ్ళతో  చంద్ర కొయ్యలను సైతం విరిచేటువంటి చేతులతో  ఊరువులు మేరువులు ఉరముబారెడు పొడవు ఒడ్డు పొడవుల దొడ్డ ఏనుగు అతడు  కర్ర సాధనలో కానీ కత్తి ఎత్తడంలో కానీ ఎదురులేని వీర యోధుడు  నిజమైన ఆత్మహితుడు  అయితే అతనిలో రెండు దురభ్యాసాలు ఉన్నాయి ఒకటి కల్లు తాగడం  రెండు సాని కొంపలకు వెళ్లడం రాజుకు తెలియకుండా దొంగ చాటుగా ఈ పనులు చేస్తూ ఉంటాడు మల్లు దొర  ఎప్పటికప్పుడు మానివేస్తానని చెబుతూనే ఉంటాడు తిరిగి తిరిగి ఆ తప్పు చేస్తూనే ఉంటాడు  రాజు మందలిస్తే రహస్యంగా వెళ్ళిపోతాడు అయితే మల్లు రాజు కొరకు ప్రాణమిచ్చే మిత్రుడు మన మల్లు దొర.


కామెంట్‌లు