ఇక్కడ ప్రశ్నించడం అంటే
తప్పు ఎత్తిచూపడం కాదా!?
కాదు కాదు ముమ్మాటికి కానే కాదు?
ఇక్కడ ప్రశ్నించడం అంటే
కోటరీగా ఏర్పాటు చేసుకుని
ఏలుతున్న మహారాజులని
వేలెత్తి చూపడం
ఇది ముమ్మాటికీ తప్పే2
తప్పును తప్పు అనకూడదు ఒప్పే అనాలి
బాకా ఊదడం నేర్చుకోవాలి
ఇది బతుకు ,బతక నేర్చినసూత్రం
అనుకోవాలి
తప్పు ముమ్మాటికి తప్పు తప్పే అయినా
గురువింద నీతి గల సంఘానికి
ఒప్పు గురించే చెప్పాలి
ఎప్పటికైనా బలహీనుడు బలవంతుడిని ఎదిరించడం
కొరివి తో తల గోక్కోవడమే
ఎంత తక్కువగా ప్రశ్నిస్తే
మనమంతా సేఫ్ జోన్ లో ఉంటాం
ఇక ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగలనిద్దాం
మనం మూగిగా
చెవిటి గుడ్డిగా
జీవించడానికి అలవాటు పడదాం
తప్పు ఎత్తిచూపడం కాదా!?
కాదు కాదు ముమ్మాటికి కానే కాదు?
ఇక్కడ ప్రశ్నించడం అంటే
కోటరీగా ఏర్పాటు చేసుకుని
ఏలుతున్న మహారాజులని
వేలెత్తి చూపడం
ఇది ముమ్మాటికీ తప్పే2
తప్పును తప్పు అనకూడదు ఒప్పే అనాలి
బాకా ఊదడం నేర్చుకోవాలి
ఇది బతుకు ,బతక నేర్చినసూత్రం
అనుకోవాలి
తప్పు ముమ్మాటికి తప్పు తప్పే అయినా
గురువింద నీతి గల సంఘానికి
ఒప్పు గురించే చెప్పాలి
ఎప్పటికైనా బలహీనుడు బలవంతుడిని ఎదిరించడం
కొరివి తో తల గోక్కోవడమే
ఎంత తక్కువగా ప్రశ్నిస్తే
మనమంతా సేఫ్ జోన్ లో ఉంటాం
ఇక ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగలనిద్దాం
మనం మూగిగా
చెవిటి గుడ్డిగా
జీవించడానికి అలవాటు పడదాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి