జాలి లేని కాలం అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఏళ్ళకేళ్ళు
నిరుపయోగంగా గడిపిన
కాలాన్ని కసిదీరతిట్టిన
నా తప్పు నేను  కప్పిపుచ్చుకొని నా  లోలోపల నేను మదన పడుతున్నా2

జాలి లేని కాలమిదని
కాల సూక్తం పారాయణం చేయండని 
కాలం విలువ  గ్రహించమని
మరి గద్దించి చెప్తున్నా2

యవ్వనపు పెడసరితనము
కాలహరణకు
పెట్టింది పేరని
ఊరు వాడ గొంతెత్తిచెప్తున్నా2

ఉన్నది ఒకటే జీవితమని
పుట్టుక మరణం మనకు తెలియదని
మనం అంటే ఏంటో మనకు తెలిసిన దశనుండి
మనంమనీషిగా మారేదాకా
మనం
ఈ లోకంలో కొన్నిజ్ఞాపకాలు వదిలేదాకా
కాలాన్ని కళ్ళకు అద్దుకుందాం2
కామెంట్‌లు