పచ్చదనం పెంచాలి!!;- -గద్వాల సోమన్న,9966414580
అందమే పంచుతుంది
ఆరోగ్యం పెంచుతుంది
నలుదిశలా పచ్చదనం
నవ్వుకుంటూ చూస్తుంది

పశు గ్రాసం అవుతుంది
ఆవాసమవుతుంది
జీవకోటికి మాత్రం
అమ్మ ఒడిగా ఉంటుంది

పర్యావరణ పరిరక్షణ
పచ్చదనం చేస్తుంది
సకల మానవాళికీ
పచ్చని తివాచీ అది

పచ్చదనం పంచాలి
ప్రకృతి శోభ పెంచాలి
మొక్కలు మెండుగ నాటి
పచ్చని పాన్పు వేయాలి

పచ్చదనం లేకుంటే
ఎడారిగా మారుతుంది
ఓజోన్ పొరకు ముప్పు
సరిదిద్దుకోవాలి తప్పు


కామెంట్‌లు