పసి పిల్లలు-సిరిమల్లెలు;- -గద్వాల సోమన్న,9966414580

పసి పిల్లల కళ్ళల్లో
పవిత్రత ఉదయించును
వారి బుడిబుడి నడకల్లో
నెమలమ్మ నర్తించును

చిన్నారుల పలుకుల్లో
తేనియలు జాలువారును
వారి చిన్ని మనసుల్లో
ప్రేమ చినుకులు కురియును

బడి బాలల చెలిమిలో
జీవనదులు ప్రవహించును
వారి చిట్టి చేతుల్లో
అక్షరాలు జన్మించును

కడిగినట్టి చూపుల్లో
వెన్నెల వెదజల్లును
పసి కూనల  హృదయాల్లో
దైవమే నివసించును


కామెంట్‌లు