జాబిలి తొంగి చూసింది
వెన్నెల విరులు విసిరింది
చుక్కల చెలికత్తెలతో
కనువిందే చేసింది
నెలవంకగా మారింది
అందాలే వెదజల్లింది
నిండు పౌర్ణమి వేళలో
వెండి కంచమై వెలసింది
చల్లని వెన్నెలకు మూలము
వెన్నెలమ్మతో బంధము
నీలి నింగిని నిండు జాబిలి
చంద్రయాన్-3 ప్రియ నేస్తము
మనోహరమైన జాబిలి
మనసులు దోచే జాబిలి
చుక్కల రాజ్యంలోన
తిరుగులేని ఘన జాబిలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి