పూలలాంటి బాలలు;- -గద్వాల సోమన్న,9966414580
పూసిన కొమ్మలు
పుత్తడి బొమ్మలు
భువిలో  బాలలు
మదిలో  మమతలు

వెలిగే చుక్కలు
ఎదిగే మొక్కలు
బడిలో పిల్లలు
మడిలో మొలకలు

అల్లరి పిడుగులు
వల్లరి మనసులు
ఎల్లరికిష్టం
చల్లని బాలలు

ఎగిరే గువ్వలు
మ్రోగే మువ్వలు
గుడిలో దివ్వెలు
వనిలో పువ్వులు


కామెంట్‌లు