అత్యంత అవసరము;- -గద్వాల సోమన్న,9966414580
తరువులోని ఫలములు
చెరువులోని జలములు
అత్యంత అవసరము
నిగ్గుదీసే కలములు

కడుపు నింపు పొలములు
శుద్ధమైన తలపులు
అత్యంత అవసరము
ఇల నైతిక విలువలు

కాయానికి వలువలు
న్యాయానికి సాక్షులు
అత్యంత అవసరము
సదనానికి వనితలు

నింగిలోన చుక్కలు
పుడమిలోన మొక్కలు
అత్యంత అవసరము
ఇంటిలోన పిల్లలు


కామెంట్‌లు