లక్ష్మి! అచ్యుతుని రాజ్యశ్రీ

 లక్ష్మి అంటే అమ్మవారు విష్ణు మూర్తి భార్య అని తెలుసు.కానీ శుక్రవారం ఆమెకు పూజలు చేస్తాం.కేవలం డబ్బు నగలు కాదు ప్రతిదీ లక్ష్మీ స్వరూపం.శుచిశుభ్రం నోటి వాక్కు ఆరోగ్యం చదువు అన్ని డబ్బు కన్నా మిన్న.ఆరోగ్యం ఉంటే కదా ఏపనైనా చేసి ధనం సంపాదించగలం.ఆమె చంచల ఒకేచోట స్థిరంగా ఉండదు అంటాం.కానీ మనం బాగా ఆలోచించాలి.చెడ్డప్రవర్తన మాట అశుభ్రంగా అసహ్యంగా ఉన్న వ్యక్తి ఇంటికి షాపుకి మనం వెళ్లము.గలీజుగా ఉంది అంటాం.మరికోపిష్టి విసుగు నిర్లిప్తత చిరాకు పడేవారికి  ఉద్యోగం ఎవరు ఇస్తారు చెప్పండి!? మంచిమాట చేతలతో ఉంటే అంతా గౌరవిస్తారు.అదే లక్ష్మి.బద్ధకం వదలాలి అని శుభ్రంగా ఉండాలి అని ఇల్లంతా కడిగి ముగ్గులు అలంకరణ చేస్తాం.మనం చంచలత్వం లేకుండా ఉండాలి.మానసికశుద్ధి ఉండితీరాలి.చంచలంగా ఎందుకు ఉంటుంది అంటే చెడ్డ వారు ఇంకా పతనం ఔతారు.ఆమె గోవుల దగ్గరకు వెళ్ళి " మీదగ్గర ఉంటాను" అంటే " నీవు మాగోమూత్రం మాపేడలో ఉండు.అది లక్ష్మి స్థానం గా నిన్ను కొలుస్తారు " అన్నాయి.అందులో‌ అంతరార్థం ఏమిటి అంటే ఆవుమూత్రం పేడలో రోగనిరోధక శక్తి ఉంటుంది.వైరస్ క్రిమిసంహారక దివ్యమైనది ఆవు.అందుకే ప్రతి నోము వ్రతాలు చేసేటప్పుడు గోమయంతో అలికి బియ్యం పిండి తో ముగ్గులు వేయాలి అని మామిడి తోరణాలు కట్టాలని అనటంలో వైరస్ రోగాలు రాకుండా అడ్డుకొనే శక్తి ఉంది అని.అలా దైవం పేరిట మన పెద్దలు గోపూజ గోసంతతిని వృద్ధి చేశారు.పంటలకి పేడ గోమూత్రం చల్లితే పైరు బాగా పెరుగుతుంది.భూసారం పెరుగు తుంది.కంచి పరమాచార్య ఎక్కడికెళ్లినా గోశాల లో ఉండి అక్కడే నిద్రపోయే వారు.పిల్లలు గోశాల దర్శించాలి.ఇలా మనం వాడే వస్తువులు కూడా లక్ష్మి గా భావించాలి.దసరా రోజుల్లో మైసూర్ లో ప్రతి వస్తువు ఆఖరికి వంటకు వాడే గరిట ఆయుధాలు..ఇలా వృత్తికి సంబంధించినవి అమ్మ వారి రూపంగా గౌరవించి పూజించాలి 🌷
కామెంట్‌లు