తెలుగు వెలుగురా!- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తెలుగు మనదిరా
వెలుగు మనదిరా
తెలుగు ప్రీతిరా
పలుకు తీపిరా                ||తెలుగు||

తెలుగు సుందరమురా
ఇచ్చు సంతసమురా
తెలుగు సుమమాలరా
వీచు సుగంధాలరా            ||తెలుగు||

తెలుగు జాబిలిరా
చల్లు వెన్నెలరా
తెలుగు పలుకరా
తేనెను చిందరా               ||తెలుగు||

తెలుగు బిడ్డా
గళము నెత్తరా
తెలుగుపాట పాడరా
అమృతము కురిపించరా         ||తెలుగు||

తెలుగు మనజాతిరా
మనకు అదిఖ్యాతిరా
తెలుగుకైతలు వ్రాయరా
పాఠకులమదులు దోచరా        ||తెలుగు||

తెలుగు మనతల్లిరా
సేవలను చెయ్యరా
తెలుగు మనదేవతరా
మంగళ హారతులివ్వరా         ||తెలుగు||

తెలుగు అజంతాభాషరా
దేశమందు బహులెస్సరా
తెలుగుబిడ్డలు గొప్పరా
బహుతెలివైన వారురా          ||తెలుగు||

తెలుగు విదేశీయులుమెచ్చినభాషరా
ప్రపంచాన విస్తరిస్తున్నభాషరా
దేశవిదేశాలకు తీసుకెళ్ళరా
దశదిశాలా వ్యాపింపజేయరా     ||తెలుగు||


కామెంట్‌లు