ఆసియాలోనే అతిపెద్ద జాతర
మాఘములో జరుపు జాతర
రెండేళ్లకు ఓసారి జాతర
చూడచక్కని తెలుగు సున్నితంబు
ఎన్నోయేళ్ళ చరిత కలది
వన దేవతలను పూజించేది
తెలంగాణ ప్రశస్తిని చాటేది
చూడచక్కని తెలుగు సున్నితంబు
గద్దెలే అక్కడ గర్భగుడులు
సమక్క సారలమ్మ దేవతలు
గిరిజన వాసుల ఇలవేల్పులు
చూడచక్కని తెలుగు సున్నితంబు
వివిధ రాష్ట్రాల భక్తులు
విచ్చెదరు నమ్మకంతో జనులు
చూచుటకు చాలవు కనులు
చూడచక్కని తెలుగు సున్నితంబు
జంపన్న వాగులో స్నానాదులు
బెల్లంతో అమ్మవారికి నైవేద్యాలు
కోర్కెలు తీరుతాయని నమ్మకాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు
: మేడారం జాతర(సున్నితం)-: కె.కవిత- హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి