గురజాడే ;-డా.గౌరవరాజు సతీష్ కుమార్
గురజాడ వారి జాడ 
ప్రస్తుతం ఎక్కడా జాడలేదు
వారి కథలు, కథానికలు, గేయాలు, 
బాలగేయాలు అనువాదాలు, నవలలు
కనుమరుగై కళ కోల్పోయాయా
లేక మనమే నిర్లక్ష్యం చేస్తున్నామా
యుగకర్త యుగానికి ఒక్కడు 
అక్షర మాంత్రికుడు
వ్యవహారిక భాషకు 
పట్టాభిషేకం చేసిన మహనీయుడు
వారి ముత్యాలసరాలు 
స్వాతి ముత్యాలసరాలే
తెలుగు భాషతో పసిడితాపడం చేసిన
బృహత్ యత్న కాంతులే
అరటికాయబజ్జి మినప్పప్పు సొజ్జి
అంటూ ఆనందంగా బాలగేయాలు రచించినా,
కన్యక లాంటి కథలు రాసినా 
గురజాడకు సాటి గురజాడేకదా!!
**************************************
; . 

కామెంట్‌లు