సౌందర్య లహరి ; - కొప్పరపు తాయారు
 🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟
హిమానీహంతవ్యం హిమగిరినివాసైకచతురౌ
నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ ।
వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్ ॥ 87 ॥

పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులామ్ ।
కథం వా బాహుభ్యాముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా ॥
88 ll 
87) అమ్మా ! జగజ్జననీ! తామర పువ్వులు మంచులో రాత్రులు శోభ కోల్పోతూ ముడుచుకుపోతున్నాయి . హిమవత్ పుత్రిక వైన నీ పాద పద్మములు మాత్రం ఎంత గడ్డ కట్టిన మంచులో కూడా వికసిస్తూనే ఉన్నాయి కదమ్మా! రాత్రులు తెల్లవారుజామున కూడా ప్రకాశిస్తూనే ఉంటాయి కదమ్మా! నీ పాద పద్మాలు! తామర పూలు లక్ష్మీదేవికి నివాసం కానీ నీ పాదపద్మాలు కోరిన సంపదలిచ్చే లక్ష్మీ కటాక్షాలు, ఇన్ని ఉత్తమ లక్షణాలు
కలిగిన నీ పాద పద్మాలు లోకంలోని అన్ని పద్మాలన్నింటినీ కూడా జయించాయి అనటంలో ఆశ్చర్యం ఏముంది తల్లీ !
88)
       దేవీ! అమ్మా! మీయొక్క పదములమ్మా! కీర్తి కి ఆవు పట్టు, విపత్తులకు స్థానం లేదు కదా! తల్లీ!
అమా! నీ యొక్క పాదములను తాబేలు కఠినమైన పైన డిప్పతో ఎలా పోల్చారు తల్లీ! పరమశివుడు కూడా ఎటుల వివాహ సమయమున సన్నికల్లు మీద నీ పాదం పెట్టినారు తల్లీ!
                     ***🪷****
🌟 తాయారు 🪷

కామెంట్‌లు