శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
206)శాస్తా -

శృతి స్మృతులతో శాసించువాడు
బుద్ధదేవుడు తానైనవాడు
శాసనమును జేయగలవాడు
శమదమములనిచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
207)విశ్రుతాత్మా -

విశేష శ్రవణముజేయువాడు 
మిక్కిలి ప్రసిద్ధిచెందినవాడు
అందరికి తెలిసినట్టివాడు
కీర్తి వ్యాపించినట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
208)సురారిహా-

దేవరిపులను తొలగించువాడు 
సురుల శత్రువుల నాశకుడు
దివ్యులను కాపాడువాడు
అసుర సంహారము జేయువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
209)గురుః -

ఆత్మవిద్యను బోధించగలవాడు
ఆశ్రితుల కాపాడుచుండువాడు
బృహుస్పతియే తానైనవాడు 
ఉపాధ్యాయ గుణమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
210)గురుత్తమః -

గురువులలోనే అగ్రగణ్యుడు
సాధకులలో ఉత్తమమైనవాడు
అందరికి తెలియజెప్పెడివాడు
బోధకులలో ప్రథముడైనట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు