నిశ్శబ్దం; - యడ్ల శ్రీనివాసరావు- విజయనగరం
 కాకులు తిరుగుతున్నాయి
కుక్కలు బెంబేలెత్తుతున్నాయి
ప్రాతః కాలం ఉదయిస్తున్నది
నూతిలో నీరు నలుపే పారిందా
కంటిలోని చమ్మ నిశ్శబ్దమై మిగిలిందా
కోటి కో సూర్యుడు
అందరిలో ఒక్కడు
అలుపెరగని దివిటి అతడు
తన కంఠస్వరం ఉరిమింది
తను నాట్యం గర్లకంఠం
ముసి ముసి నవ్వుల నవ్వలేక
కెవ్వుమని కేక వేస్తున్న వేళ
నేలతల్లి జోల పాడిన రాత్రి
అది ఓ విషాద కాళరాత్రి
ఎర్ర జెండా కన్నుమూసింది
ఎర్ర సూరీడు దూరం అయిపోయాడు
నింగిలో చేరుకు పోవడానికి
ఇంకా కొన్ని క్షణాలు అయినా లేదు
నేల తల్లి నిషేధిలో కడుపుకుంది
ప్రాతఃకాలం చూసేసరికి బూడిద మిగిలింది
అన్నా గద్దర్ అన్న నిన్ను చూడలేకపోయాను
నా కనులు కంటి చమ్మ
ఆపలేకున్నాను
నీ ఆశల సౌధం గొప్పది
నీ పోరాటం మహోన్నతమైనది
వేగు సూర్యుడే ఉదయిస్తావు అనుకున్నాను
నేడు బూడిద చూసి కన్నీరే ఏడ్చాను
ఆకాశ తరంగాలు దాటి నీ పాటలు ఆడుతున్నాయి
భూ మండలం సైతం నిషేధి వరకు నీ శివతాండవం బెంబేలెత్తిస్తోంది
మరువలేక ఉన్న ఈ చల్లని గడియ
నీతో గడిపిన మధుర క్షణాలు విడవలేకున్నా
పుడమి తల్లి నచ్చట నుండి నువ్వు మట్టిలో కలియంగా
ఆమె ఎరుపెక్కి నుదుటి సూర్యుడు ఉదయిస్తున్నాడు మరలా చూసి
కానీ భరతమాత తెలుగు తల్లి కంట కన్నీరు వస్తుంది ఎందు చేత
నువ్వంటే మమకారం
నువ్వంటే అనురాగం
నువ్వంటే అభిమానం
నువ్వంటే ఆప్యాయత అనుబంధం
నిజము సుమా ఈ నిశ్శబ్ద గడియ అంతం..! 
ఈ నిశ్శబ్ద చేతన స్థాయిలో నా పలుకు శూన్యం..!! 
----------------------------------------

కామెంట్‌లు