శ్రీ విష్ణు సహస్రనామాలు - (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
296)కాంతః -

అద్భుతమైన రూపమున్నవాడు
సర్వులనూ ఆకర్షించువాడు
మోహినియవతారమున్నవాడు
వ్యామోహమున ముంచునట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
297)కామః -

చతుర్విధ పురుషార్థాలిచ్చువాడు
భక్తులచే కోరబడుచున్నవాడు
ఇచ్ఛాశక్తిని కలిగినవాడు
అభీష్టములు నెరవేర్చగలవాడు 
298)కామప్రదః -

కోర్కెలన్నియు తీర్చుచున్నవాడు
అర్థించినవి ప్రసాదించువాడు
ఇష్టక్రియలను జరిపించువాడు
అన్నియును యివ్వగలిగినవాడు 
 శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
299)ప్రభుః -

విశ్వమునకు ప్రభువైనట్టివాడు
పరిపాలనము చేయుచున్నవాడు
లోకాధిపత్యము కలిగినవాడు 
ప్రభువుగా బాధ్యతగలవాడు 
300)యుగాది కృత్-

యుగములను ప్రారంభించినవాడు
కాలగమనం శాశించినవాడు
యుగధర్మం నిర్వహించగలవాడు
ఆదినుండి అధిపతియైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు