చిత్రానికి పద్యం సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల
రంగుల గులాబి తోటన్
నంగనతావంగి యందు నతిమధురంబౌ
సంగతికనుగొని తనుతా
సింగులు సవరించి కలుపు చేతనదీసెన్

పరిమళమౌ పూలసొబగు
విరియగ ,ఫాలాక్షు మెడన వేయగ భక్తిన్,
తిరుగుచుతోటన గోయగ
విరులనుమాలల్లజూచె ప్రేమారగనే

కామెంట్‌లు