జీవన సందేశం;- సి.హెచ్.ప్రతాప్

 మానవ వ్యక్తి యొక్క భావన, జీవితం యొక్క ఉద్దేశ్యం మరియు మరణం యొక్క అర్థం. మానవుడు పరమాత్మ నుండి వచ్చినవాడు, శాశ్వతమైనవాడు మరియు జ్ఞానం మరియు అనుభవాన్ని పొందగలడు. మానవ జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, నిర్దేశించిన మార్గాల ప్రకారం జీవితాన్ని ధర్మబద్ధంగా జీవించడం ద్వారా మరియు ప్రపంచ భ్రాంతి నుండి నిర్లిప్తతను సాధించడం ద్వారా అంతిమ వాస్తవికత, పరమాత్మతో ఏకం చేయడం. మరణం జీవితంలో ఒక భాగం మరియు దానిని అంతం చేసేది కాదు. మరణం యొక్క క్షణం అంతిమ పరివర్తనకు ఒక అవకాశం, మోక్షం అని శాస్ర్రాలు బోధిస్తున్నాయి.తమను గూర్చి తీవ్ర తపనతో చింతన చేయుటకు అంతర్ముఖులై తెలుసుగొన యత్నించడమే సర్వ మతముల సారాంశం. ఇతరుల మతం కంటే తమ మతమే గొప్పదన్న అహంభావంతో ఇతర మతములను , మతస్థులను కించపరచడం, తిరస్కార భావం చూపించుట అన్నింటి కంటే నిష్కృతి లేని మహా పాపం. స్వధర్మే నిధనం శ్రేయ : అన్నది గీతాచార్యుని ఉవాచ. స్వధర్మ పాలనే అతి శ్రేయస్కరం. తమకు విధించిన ధర్మాలను చిత్త శుద్ధితో ఒనరించడం ,పవిత్ర సంస్కారాలతో, ఉత్తమ విలువలతో సర్వ మత సమానత్వ భావనతో జీవన యానం సాగించుటే మన కర్తవ్యం.కాస్తంత దయ, కొంచెం ప్రేమ, రెండు ఓదార్పు మాటలు చాలు. మానవుని మహనీయునిగా చేయుటకు మానవుల సహజ ఆనందమయ స్వభావమును మరుగున పరచుకొని సంఘర్షణాత్మకమైన వైఖరిని అలవర్చుకొని కల్లోల భరిత హృదయం తో హింసాత్మక పద్దతిలో దానవులవలే
జీవించడం కడు బాధాకరం అభివృద్ధి వెంపర్లాటలో ధనార్జనే ధ్యేయం గా సంపదల వేటలో ఈ అందమైన ప్రపంచాన్ని
కల్లోల భరితం చేస్తున్న వైనం దయనీయం. సాటి మానవుల పట్ల కరుణ మృగ్యం ప్రేమ, దయ, వాత్సల్యం అనే మాటల చిరునామా ఏది ?. ఇతరుల పట్ల దయ చూపే తత్వం. పగ ప్రతీకారములను త్యజించడం సర్వ మానవ సౌభ్రాతాతృత్వం అలవర్చుకోవడం, దైవ ప్రార్ధనతో హృదయాలను పవిత్రపరచుకోవడం, మానవులుగా జన్మించినందుకు మన ముఖ్య కర్తవ్యాలు. ఇదే ఆ గీతాచార్యుని సందెసం  యొక్క సందేశం, మనందరికీ సదా ఆచరణీయం. 
కామెంట్‌లు