కడుము ఉన్నత పాఠశాల పనితీరు సంతృప్తికరం

 పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి, విద్యార్థుల గుణాత్మక విద్యాసాధనకు ఉపాధ్యాయులంతా  మిక్కిలి శ్రమిస్తున్నారని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన మండల అభ్యసనాభివృద్ధి కార్యక్రమ పర్యవేక్షణ బృంద సభ్యులు అభినందించారు. మండల విద్యాశాఖాధికారి సి.హెచ్.గోవింద నేతృత్వంలో ఎనిమిది మంది లిప్ టీమ్ సభ్యులు పాఠశాలను సందర్శించి పాఠశాల పనితీరు మిక్కిలి సంతృప్తికరంగా ఉందని ప్రశంసించారు. మండల లిప్ టీమ్ మానిటరింగ్ లో భాగంగా తొలుత ఆరవ, ఏడవ, ఎనిమిదవ తరగతులందు ఏమేరకు లిప్ అమలు చేస్తున్నారో విద్యార్థులను సామర్ధ్యాల వారీగా ప్రశ్నించగా, సరైన సమాధానాలిచ్చిన విద్యార్థుల స్పందన బాగుందని మండల విద్యాశాఖాధికారి సి హెచ్ గోవింద అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావును అడిగి నమోదు పర్చిన లిప్ రికార్డులను, పాఠశాల రికార్డులను పరిశీలించారు. 
తనిఖీ బృంద సభ్యులైన కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.గోవిందరావు, ఉపాధ్యాయులచే ఐ.ఎఫ్.పి.పానెల్ ద్వారా స్క్రీన్ ప్లే చేయించి పాఠ్యబోధన గావించారు. 
వారి బోధనాతీరు పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయులంతా
ప్రాక్టీస్ పీరియడ్, టీచింగ్ పీరియడ్స్ తదితర వ్యూహాలన్నీ విద్యాశాఖ నిబంధనల ప్రకారం అమలుపర్చి బోధిస్తున్నారని అన్నారు.
బృందసభ్యులు జి.శంకరనారాయణ 
బేస్ లైన్ టెస్ట్ పేపర్లను, రెండవసారి నిర్వహించిన జనవరి నెలాఖరు టెస్ట్ పేపర్లను తనిఖీ చేసి సాధించిన ప్రగతిని గుర్తించారు. పాఠ్య పథక రచనలు, ఉపాధ్యాయుల డైరీలు, లిప్ రిపోర్ట్స్, పాఠశాల అసెంబ్లీ తదితర రికార్డులను కూడా పరిశీలించి పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేసారు. మురళీధర్ మహంతి పాఠశాల పరిసరాల మరియు టాయిలెట్ల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం, మంచినీటి సౌకర్యం, మొక్కల పెంపకం అమలు తీరును పరిశీలించారు. పి.నారాయణరావు ఆంగ్ల మాధ్యమ టోఫెల్ విధానంలో విద్యాబోధన, టోఫెల్ రికార్డులను పరిశీలించారు. జె.ధర్మారావు ధారాళంగా తెలుగులో చదవడం, రాయడంలో విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. ఎ.ఆదినారాయణరావు గణిత చతుర్విధ ప్రక్రియలను, రేఖాగణిత, బీజగణిత సూత్రాలను ఎలా అన్వయించి సాధించుచున్నారో పరీక్షలు నిర్వహించారు. గుంటు చంద్రం సాంఘిక శాస్త్ర వివిధ పటాల నైపుణ్యానికి సంబంధించిన, భారత రాజ్యాంగ అంశాలను ప్రశ్నావళి నిర్వహించారు.
విద్యార్థుల వర్క్ బుక్స్, నోట్ బుక్స్ ను తనిఖీ చేసి, వారి సామర్ధ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల పాఠ్యబోధనలను పరిశీలించారు. 
మండల లిప్ పర్యవేక్షణ టీమ్ సభ్యులందరూ 
పాఠశాల కార్యక్రమాలు, లిప్ అమలు తీరు పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసి ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావును, ఉపాధ్యాయులను అభినందించారు. నేటి పాఠశాల సందర్శనలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, వై.నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ పాల్గొన్నారు.
కామెంట్‌లు