సుప్రభాత కవిత ; - బృంద
గగన వీధిలో పయనించే
వెలుగురథం ఊరేగింపులో 
దారిపొడుగునా పరచుకున్న
పాల మబ్బుల కవాతు

పొన్నపూవు రంగులో
పుత్తడంటి మెరుపులతో
పుట్టిన బంగరు బంతికి
అంబరమంతా మైదానమే!

సాగర తీరాన సాగే ఆడుగులు
చూపులు నిలిపిన తూరుపు
గుండెను నింపిన వెలుగులు
వింతగ తోచిన అందాలు

నిలిచిన మనసుకు నీడగా
పిలిచే పిలుపులు తోడుగా
తలిచే గమ్యమే చేరగా
కలలే కమ్మగ పండగా

అలలై తలపులు తాకగా
కలతే కన్నులు నింపగా
కన్నీరే దోసిలి నిండగా
జాలిగా వరములిమ్మంటూ

కోరే మనసును కరుణించి
వరమే వేయిగా కుమ్మరించి
జయమే నీకని దీవిస్తూ
భయమే వలదని ధైర్యం చెప్పే

కొత్తవెలుగుల కిరణాలకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు