తెలిసీ తెలియని పయనం - పాడి కవిత (లతరమేష్)-కాటారం
కుసుమ ధర్మన్న కళా పీఠం 
=========================
చీకటి వెలుగుల రైలు ప్రయాణంజీవితం 
అంతా ఒక బండి వారమే 
అయినా  ఎవరి ప్రయాణం వారిదే ..

మలుపు మలుపులో 
ఆనందాలు అనుభూతులు 
అభిమానాలు ఆప్యాయతలు పంచే  ఆత్మీయతలెన్నో...

ఆరాటాలు పోరాటాలు
అసూయలు అలకలు చూపే నేస్తాలెన్నో.....

బాధలు బాధ్యతలు 
కష్టాలు కన్నీళ్ళు పంచుకునే బంధాలెన్నో....

కర్కశ  కాఠిన్య 
రాక్షస రాబందు రక్తసంబంధాలెన్నో....

వెల్లువెత్తే ఆశలు ఎన్నో...
ఎగసిపడే ఆశయాలెన్నో...

మదిని గుచ్చే ముల్లులెన్నో... 
సుతిమెత్తని హస్తాలెన్నో...

విరబూసిన వసంతాలెన్నో...
మోడువార్చిన శిశిరాలెన్నో...

దాహంతీర్చే  వర్షాలెన్నో...
దారులు  కూల్చే వరదలెన్నో...

చల్లని  హేమంతాలెన్నో...
భగభగలాడే గ్రీష్మాలెన్నో ...

శిఖరం చేర్చు  సత్భావాలెన్నో...
పతనం చేయు దుస్వభావాలెన్నో...

ఎవరి ప్రయాణం  ఏ తీరమో...
తెలసీ తెలియని ఈ గమనంలో....
వెలుగు నీడల వెన్నెలలేఖ
అందమైనది  ఈ జీవనరేఖ.

కామెంట్‌లు