పసిడి వర్షం!!!-డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా
పడతి మేఘమై పసిడి వర్షమై కురుస్తుంది.
కాల స్పర్శతో
ఉరుములు మెరుపులు పుట్టి
సూర్యాస్తమయాలు మాయమై

ఆకాశ మౌనంలో ఉఛ్వాస విశ్వాసాలు
కనురెప్పల ఊపిరితిత్తుల్లో మతిభ్రమించి
తిరిగే భూమి నాభిలో
భూగోళాలు ఉద్భవిస్తున్నాయి!!!?.

ఆపేదాకా ఆగని ఆ భామ
భూమికి భయం పుట్టిస్తుంటే
అనాగ్రాత పుష్పం సుగంధం కాదు
అమృతం సృష్టిస్తుంది.!!

తాక లేని ఆ చూపులను కొప్పులో తరిమి
ఇంద్రధనస్సు ముఖాలై
మల్లె పందిరిగా మారిన నక్షత్ర మండలం
కనకాంబరాలు కావవీ
అంబరాలు తయారు చేసిన తలంబ్రాలు.!!

తల తిరుగుతున్న ఒళ్ళు మరిచిన వాళ్లు
దేవకన్యలు!!!

ఆది దంపతుల సంతోషమే ఆ సంతానం

పగడాల వడగల్లు
కెంపులు వాగుల వంపులు
వజ్రాల జలపాతాలు
మనీ మాణిక్యాల ఉప్పెనలు
ఆ సౌందర్య సాగరాలు
ఆనంద అందాల సామ్రాజ్యాలు
రత్నరాసుల్లా రాణిలు

జాతి రత్నాల జలదిగ్బంధంలో
చీకటిని చీల్చుకొని వెన్నెల్ని నుతున్నా
నెమళ్ల నాట్యాలు వాళ్లు!!!

నుదుట సింధూరపు బొట్టుల
దీపం వెలుగుతుంది.
అది అనంత సౌందర్య సముద్రం.!!!

కదిలే పెదవులుప్పొంగీ
తీరం వెంట పడతి పాదముద్రలు చెదిరిపోతున్న
స్వరం శంఖారావమై పూరిస్తుంది.!!

ఆ సౌందర్యం ఆమరణ వీణా తరంగాలు
మరణ మృదంగాలను ఛేదించి
భువికి దించిన యముని పారవశ్యంలో
పాశం వసంతప్పిందెప్పుడో!!!?

చల్లని కళ్ళతో మెల్లని శ్వాసతో
మెత్తని పొత్తిళ్లలో
అఖండ దీపం వెలిగించి
సహస్రక్షులై సాష్టాంగ నమస్కారం చేస్తుంటే
దిగివచ్చిన తారల ఎదుట
పసిడి వర్షం ఆగి
పసిడి పడతులు ప్రత్యక్షమైరీ!!!!

డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు