దేశానికి కాలుష్యం ముప్పు;-సి.హెచ్.ప్రతాప్

 మన దేశం లో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఎన్నో చర్యలు చేపట్టామని, ఇందుకు సాలీనా ఎనిమిది వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నామని , 2025 నాటికి కాలుస్యా సూచీలో 40 శాతం మెరుగుదలే తమ ప్రభుత్వం లక్ష్యం అని ఆ మధ్య పార్లమెంటులో ప్రధాని ఘనం గా ప్రకటించుకున్నారు. అయితే ఈ ప్రకటనలు అన్నీ కాగితాలపైనే జరుగుతున్న అభివృద్ధి అని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు  అసలే మాత్రం మెరుగుపడలేదని ప్రపంచ పర్యావరణ సంస్థ తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తం గా అత్యధిక కాలుష్యం వున్న ఇరవై నగరాలకూ పధ్నాలుగు నగరాలు మన దేశం లోనే వున్నాయన్న సదరు నివేదిక మన ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి.తీవ్రరించిన వాతావరణ కాలుష్యం తో మన పల్లెలు, నగరాలు విల్లవిల్లాడుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు.దేస రాజధాని దిల్లీ లో తీవ్రమైన కాలుష్యం తో హెల్త్ ఎమర్గెన్సీ ప్రకటించాక ఇప్పుడు ఆ ముప్పు అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, ముంబయి నగరాలకు పొంచి వుందని, ఈ నగరాలలో తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య గత నాలుగేళ్ళలో 200 శాతం పెరిగిందన్న సదరు నివేదిక ఆధారం గా ప్రభుత్వాలు నియంత్రణా చర్యలను సత్వరం చేపట్టాలి.దుమ్మూ, ధూళీ కణాలతో పాటు కార్బన్ మోనో ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్,నైటోజెన్ ఆక్సైడ్,వంటి మృత్యు పధార్ధాలు ఊపిరి తిత్తులలోకి ప్రవేశించి గుండెపోటు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులు,కేన్సర్, మూత్ర పిండాల వ్యాధులకు కారకమౌతున్నాయి. బాలింతలలో, నవజాత శిశువులలో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. పరిశ్రమలకు ఇచ్చే లైసెన్సులలో సరళీకృత విధ్శానాలు , వాటి కాలుష్యం పై సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం, విశంఖలంగా పెరుగుతున్న వాహనాలు వెరసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి.దేశం లో మూడొంతులకు పైగా నగరాలలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుతునట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి స్వయంగా ఇటీవల ప్రకటించడం గమనార్హం.గత మూడు దశాబ్దాలుగా ప్రపంచ కాలుష్య మండలి దేశం లో పెచ్చుపెరుగుతున్న కాలుష్యం గురించి ప్రమాదకర హెచ్చరికలు చేస్తున్నా అవి మన ప్రభుత్వాల ముందు బధిర శంఖారావాలే అవుతున్నాయి.  
కామెంట్‌లు