గణితం లో గమ్మత్తు.. సేకరణ-అచ్యుతుని రాజ్యశ్రీ

 శుభకార్యాల్లో డబ్బు ఇవ్వడం ఇప్పుడు పరిపాటి ఐంది.101 501 1001 ..ఇలా నోటుకి ఒక రూపాయి నాణెం ని జతచేర్చి కవరులో పెట్టి ఇవ్వాలి.చివర్లో సున్నా 0ఉంటే ఆఖరు అంతం అని అర్థం.చివరిఅంకె ఒకటి ఉంటే కొత్తదనం ఆరంభం అని అర్థం.శుభసూచకం.గణితశాస్త్రప్రకారం 100 500.. పూర్తిగా భాగింపబడ్తాయి.ఒకటి చివరి ఉంటే శుభాకాంక్షలు ఆశీస్సులు అవిభాజ్యంగా ఉండాలి అని సూచిస్తుంది.బహుమతి ఇచ్చే పుచ్చుకునే వారిమధ్య బంధం కొనసాగించాలనే భావన ఇమిడి ఉంది.ఒక రూపాయి నాణెం ని పెట్టి ఇవ్వాలి.నాణెంలోహంతో తయారవుతుంది.భూమినుండి లోహం తీసి నాణెం ని చేయడంలో భూమిని లక్ష్మి గా ఆరాధించాలని కాపాడాలని పూర్వీకులు అభివర్ణించారు రూపాయి రూపాయి చేర్చి పెద్ద మొత్తంలో ఆదాచేసేవారు.మట్టి ముంతకి చిల్లి ఉండేది.దానిలో రోజూ రూపాయి నాణెం వేసి అది నిండాక అవసరాలు దాన్ని పగులగొట్టి వాడుకునే వారు.అదే నేడు పిల్లలకి కిడ్డీ బ్యాంక్ అని ఇస్తున్నాం.

కామెంట్‌లు