దివ్యత్వం; - సి.హెచ్.ప్రతాప్
  ఆత్మజ్ఞానం ఎంతో లోతైంది. ‘ఆత్మానుభవం’ అనుభవైకవేద్యమే కానీ, పుస్తకాల్లో రాసేది, ఉపన్యాసాల్లో వినేది కాదు. స్వయంగా సాధన చేసి అనుభూతి చెందాలి.స్థూలంగా దివ్యత్వం అనేది ఎదో ఒక చోటులో కాదు, అది అందరిలో ఉంది అని, దానికి ఎటువంటి విచక్షణ ఉండదు.అహం బ్రహ్మాస్మి’ అంటే ‘నేనే బ్రహ్మనై ఉన్నాను’ అని చెప్పింది బృహదారణ్యకోపనిషత్తు. ‘పరబ్రహ్మకూ, జీవాత్మకూ భేదం లేదు, రెండూ ఒకటే!’ అని అర్థం.ప్రజ్ఞానమ్‌ బ్రహ్మ’ అంటే ‘ప్రతి మానవునిలో (జీవిలో) ఉండే స్వస్వరూపానికి సంబంధించిన ఎరుకే బ్రహ్మ!’ అని చెప్పింది ఐతరేయోపనిషత్తు.ఈ విషయాన్నే అవ్రవిందులు అద్భుతంగా చెప్పారు:
"
శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని(శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు. ముందుగా వ్యక్తి తనలోని చేతనతో తాదాత్మ్యం చెందాలి. ఆ తరువాత విశ్వ చేతనతో ఏకం కావాలి. అప్పుడు విశ్వాతీతంగా ఉన్న దివ్య చేతన ఈ రెండు స్థాయులతో తనంతట తాను అనుసంధానం చెందుతుంది. అలా జరిగినప్పుడు వ్యక్తిలోని శరీరం, జీవశక్తి, మనసు పూర్తిగా దివ్యతను సంతరించుకొని, రూపాంతరం చెందుతాయి. దివ్య చేతన తమ ద్వారా ప్రకటితం కావడం కోసం పారదర్శకంగా తయారవుతాయి. ఈ స్థాయికి మనం చేరుకున్నప్పుడు - దివ్య చేతన మనలో ఆవరించి, మన మనః ప్రాణదేహాలను రూపాంతరీకరిస్తుంది. అప్పుడు ఆ మానవ జీవితం దివ్య జీవనం అవుతుంది. దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు"
దివ్యత్వం పై స్వామి అరవింద చెప్పినట్లు బహుశా ఇంకెవరూ చెప్పి వుందరేమో అన్నిపిస్తుంది పై వివరణ చదివాక.
 
మనిషిగా పుట్టిన ప్రతీవారూ దివ్యత్వం కలవారే అంటోంది వేదం. కానీ నీలో వున్న ఆ దివ్యత్వా న్ని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. నాలుగు యోగమార్గాల సమ న్వయమే దివ్యయోగం.
కర్మయోగం ద్వారా మనలోనున్న దివ్యత్వాన్ని తెలుసుకోవ చ్చు. పనిచేయకుండా ఏ మానవుడు ఉండలేడు, ఉండకూడదు. ప్రతివారూ కారణజన్ములే! అందరికీ కర్తవ్యం ఒకటుంటుంది. లేక పోతే సృష్టించుకోవాలి. అదే ఆత్మశోధన.

కామెంట్‌లు