ప్రేమOటే అమ్మదే;- ధనాశి ఉషారాణి-రచయిత్రి భాకరాపేట

 కష్టాలు  దిగమింగి కన్నీరు కార్చి
పొత్తిళ్లల్లో బిడ్డకోసమై ప్రాణము ఫణముగా పెట్టి
పదిమందిలో పేరు తెచ్చుకోమని ఆశీర్వదించిన స్వచ్ఛమైన త్యాగo ముందు
నీటి బుడగలా నిత్యo బ్రతకమని ఆశలు తుంచి
నాలుగు గోడలే హద్దుగా  ఉషోదయoను అడ్డుకొనే భర్తపెత్తనం ఇంకెన్నాళ్లు
ప్రేమనే ముసుగును కప్పి అసూయనే తూటాని పేల్చి
గుండెను రంపముగా కోసేటి మగాడిపెత్తనం ఇంకెన్నాల్లు
అవసరాల బోనులో ఆడదాన్ని ఆటబొమ్మను చేసి మనసుకు సమాధి కట్టి
మాటలతో మాయజేసి కరెన్సీ కోసమై కన్నీటిని మిగిల్చి
కులమనే కుమ్ములాటలో స్వేచ్చమైన స్నేహాన్ని కాలరాసి
ఆడదాన్ని ఆటబొమ్మను చేసే మృగాళ్లకి జ్ఞానోదo ఇంకెన్నాల్లు
నటించే మనుషుల మధ్య నిత్యo మెలకువతో
బ్రతకమని దీవించిన అమ్మ ప్రేమను నమ్మడమే న్యాయం 
నిత్యo బ్రతుకు సమరములో గెలువడమే జీవితo
నిండు మనసుతో బతుకు బాటలో ఒంటరిగా నిలిచి గెలువడమే జీవిత రహస్యo
  

కామెంట్‌లు