ఆలోచన;- చెప్యాల స్నిగ్థ- ఆరవ తరగతి- ZPHS హవేలీ ఘనపూర్- మెదక్ జిల్లా- 9705182096
  అనగనగా ఒక ఊరిలో సోనీ, చైత్ర అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు ఉండేవారు. ఇద్దరు ప్రతిరోజు బడికి వెళ్లేవారు. వీళ్లు బడికి వెళ్లే దారిలో బాగా కోతులు ఉండేవి. ఒకరోజు ఆ కోతులను చూసి ఇద్దరు పరిగెత్తి దూరంగా పరుగెత్తారు. ఇంటికి వెళ్ళుదామంటే అమ్మ నాన్న పొలం పనులకు వెళ్తారు. ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదు. కానీ వాళ్లు బడికి వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు.
                 చాలాసేపు ఒక చోటు దగ్గర నిల్చున్నారు. ఇద్దరు కలిసి బాగా ధైర్యం తెచ్చుకున్నారు. తాము తెచ్చుకున్న సంచిలో బిస్కెట్ ప్యాకెట్ ఉంది. నెమ్మదిగా బిస్కెట్లను చేతిలో పట్టుకొని దారి పక్కకు విసిరేశారు. కోతులు బిస్కెట్ల వైపు వెళ్ళగానే అక్క చెల్లెలు ఇద్దరు బడికి వెళ్లారు. బడిలో మాస్టారులకు కోతుల గురించి చెప్పగా వారు ప్రతి రోజు సోని, చైత్రలను బడికి తీసుకువచ్చి తిరిగి వాళ్ళ ఇంటికి పంపే ఏర్పాటు చేశారు. ఇద్దరూ చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకున్నారు
నీతి: చక్కటి ఆలోచనతో సమస్య పరిష్కరించుకోవచ్చు

కామెంట్‌లు