హనుమంతుడు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పవనసుతునికి మరొక పేరు హనుమంతుడు. హనుమంతుడు అంటే బుద్ధి కలిగిన వాడు రాముడు మంచి బాలుడు అన్నట్లుగా  హనుమంతుడు మంచి బుద్ధి కలిగిన బాలుడు అని చెప్పుకుంటాం  ఈ బుద్ధికి పరిమితి ఉన్నదా  కొన్ని విషయాలు నేర్చుకున్న తరువాత  అక్కడితో ఆగిపోవాలని ఏ మనిషి కోరుకోడు ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకుంటాడు  అతను అనుకున్న ఆ విషయాలు నేర్చుకున్న తర్వాత మరికొన్ని మరికొన్ని అంటూ తన జీవితం మొత్తం  నూతన విషయాలను తెలుసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు  అది బుద్ధి లక్షణం  ఆ లక్షణం  హనుమంతుని  ప్రతి కదలికలోనూ మనకు తెలుస్తూనే ఉంటుంది.
నిజానికి హనుమంతునిది చాలా చిన్న పాత్ర  చెప్పుకోవలసిన అంత ప్రాముఖ్యత ఏమి ఉండదు  కానీ అతని పాత్రను మించిన మరొక పాత్ర మనకు రామాయణంలో కనిపించదు  శ్రీరామచంద్రమూర్తిని మించిన పనులు చేసిన మహానుభావుడు  రామాయణం చదివితే  సగం చరిత్ర  వరకు  ఈయన గురించిన ప్రస్తావన ఎక్కడా మనకు రాదు  విశ్రాంతి అయిపోయిన తర్వాత 15-20 నిమిషాలు గడిచేసరికి మనకు ఆయన  ప్రత్యక్షమవుతాడు  పాత్రను ప్రవేశపెట్టడంలో కూడా  ఈనాటి సినీ దర్శకులు ఎలాంటి  సందర్భాలను సృష్టిస్తారో కథానాయకుని కోసం  అలా రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రతి పాత్ర  ప్రవేశం మనకు ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. అసలు రామాయణంలో ఆంజనేయునిది పాత్ర ఏమిటి  వాలి సుగ్రీవులలో  వారి తమ్ముడు సుగ్రీవుని  బంటు  అంటే సేవకుడు వాలి సుగ్రీవుని చంపడానికి సిద్ధమైనప్పుడు  సుగ్రీవుడు తన ప్రాణ రక్షణ కోసం ఎక్కడో దూర ప్రాంతాల  కొండ శిఖరం పైన చేరతాడు. అక్కడకు కూడా వస్తాడు అన్న భయంతో తాను తన పరివారంతో సహా  పరుగు పరుగున  వస్తున్న సమయంలో ఆంజనేయ స్వామి మనకు  స్వామీ ఆగండి అంటూ  ప్రవేశిస్తాడు  వారు ఎవరో  ఇద్దరు వీరులు ఇటు వస్తున్నారు  మనలను చంపడం కోసం అన్న పంపించిన వారై ఉంటారు  కనుక ఈ స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్లడం కోసం  ఇలా చేస్తున్నామని సుగ్రీవుడు చెప్పగానే  అసలు సేవా ధర్మము ఏమిటో మొదట ప్రపంచానికి తెలియజేసిన వాడు ఆంజనేయ స్వామి.


కామెంట్‌లు