పుస్తక పఠనం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చెడ్డ పుస్తకాలు కొని ఉంటాయి  అవి చదవడం వల్ల మనసు వికలమైపోతుంది  దానిలో భాష గాని విషయం  కానీ చెప్పదలుచుకున్న నీతి గాని  చదువరికి ఉత్సాహం కలిగించే విధంగా ఉంటాయి  అలాంటి వాటి జోలికి వెళ్ళవద్దు అని పెద్దలు చెప్తున్నారు  చెడ్డ పుస్తకాలలో కూడా ఓ గంట వరకు పనికి వచ్చే పుస్తకాలు కొని ఉంటాయి  ఇది కాలాన్ని చంపడానికి పనికి వస్తుంది  రైలు ప్రయాణం చేస్తూ ఉంటాం 
చదవడానికి ఏదో పుస్తకం దొరుకుతుంది అది చదువుతాము అటు పారవేస్తాం  దాని వలన చదువరి నేర్చుకునేది  ఏమి ఉండదు  ఉండకపోగా  పలు పలు విధాలుగా చెడ్డ పనులు ఎలా చేయాలో మనసు ఆరాటపడుతూ ఉంటుంది  ఇలా చేస్తే వేరే రకమైన సుఖం వస్తుందేమో అన్న దురాశ  దురాలోచనలకు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కనుక  అలాంటి పుస్తకాలు జోలికి వెళ్ళవద్దు అని చెప్తారు పెద్దలు. మనకు కాశీ మజిలీ కధలు ఉన్నాయి  ఈ కథలు చదవడం వల్ల  చరిత్ర తెలుస్తుంది  ఆ రోజులలో కాలినడకతో బృందంగా వెళ్లేవారు  ఏ ఏ ప్రాంతాలు వెళుతున్నారో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వారికి  చారిత్రక పరిస్థితులు అర్థం అవుతాయి  అభిరుచి కలిగిన వాళ్లు అక్కడ పరిస్థితులను  అక్కడ సామాన్య ప్రజలను అడిగి తెలుసుకుంటూ  ముందుకు వెళుతూ ఉంటారు. అప్పట్లో పల్లెటూర్లు ఎలా ఉన్నాయి  బస్తీలు ఎలా ఉన్నాయి  నడిచి వెళ్ళేటప్పుడు  చిన్న చిన్న అడవుడు దాటవలిసి వస్తుంది చిన్న చిన్న కాలువలు దాటవడిసి వస్తుంది  వీటన్నిటిని దాటి వెళ్లడం  నిజానికి ఎంతో కష్టంతో కూడిన పని అయినా  జీవితంలో ఒకసారి అయినా కాశీకి వెళ్లి గంగా నదిలో స్నానం చేయాలి అన్న  వేద సూక్తిని  నమ్మి అక్కడకు వెళ్లి అక్కడ దేవతలను  దేవుళ్లను పూజించి  గంగాస్నానం చేసి తిరిగి వచ్చేవారు  వచ్చిన తర్వాత ఆ గ్రామంలో అందరికీ కూడా వీళ్లు బ్రతికి వచ్చారు అన్న ఆనందం వచ్చిన ప్రతివారు  ఆ గ్రామంలో ఉన్న ప్రతి బంధువు స్నేహితుడు అందరినీ పిలిచి కాశీ దారాలు ఇవ్వడం కాశ్మీర్ నుంచి తెచ్చిన  ప్రసాదం పెట్టడం  చక్కటి షడ్రసోపేతమైన భోజనం పెట్టి  అందరి ఆశీస్సులు తీసుకునేవారు ఎవరో చెప్పిన విషయాన్ని విని అర్థం చేసుకోవడం కన్నా ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడం  అనుభవపూర్వకంగా తెలుసుకున్నది శాశ్వతంగా జ్ఞాపకం ఉంటుంది అని చెప్పడానికి ఈ కాశి యాత్ర మనకు ఉపయోగకరంగా ఉంటుంది.


కామెంట్‌లు