స్నేహబంధం; - కోల రేఖ, 8వ తరగతి జెడ్పిహెచ్ఎస్ ఇబ్రహీం నగర్, మండలం. చిన్నకోడూరు, జిల్లా. సిద్దిపేట. సెల్: 8885421672.
 బండారుపల్లి అనే ఊరు. ఇ ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళ పేరు రాము, సోము.  వారిద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. ఇద్దరూ పాఠశాలకు కలిసి వెళ్తారు. ఇద్దరూ మంచిగా చదువుకుంటారు. ఒకే దగ్గర కూర్చొని ఆటపాటలతో సంతోషంగా ఉంటారు. వారిద్దరూ ఎవరికైనా ఆపద వస్తే ఆదుకుంటారు. వారి బాధను స్నేహితులతో పంచుకుంటారు. బాధలు వస్తే సహాయం చేస్తారు. వీరి తరగతిలో రాము, సోము ఎక్కువగా మార్కులు తెచ్చుకుంటారు. ఎవరడిగినా దానం చేస్తారు. స్నేహితులకు చదువును నేర్పిస్తారు. స్నేహం అనేదే రెండు మనసులు కలిస్తే అవుతుంది. వారిద్దరిని విడిపోయేటట్లుగా వారి తరగతుల్లోని గోపి కొట్లాట పెట్టాడు. వాళ్ళ సంతోషాన్ని చూడలేక గోపి వల్ల ఇద్దరి మధ్య చిచ్చు రగిలింది. శత్రువులుగా మారిపోయారు. కొన్ని రోజుల తర్వాత తమ తప్పు తెలుసుకొని  రాము సోము మళ్లీ స్నేహితులుగా కలిసిపోతారు. తర్వాత గోపి దగ్గరకు వెళ్లి మా స్నేహాన్ని ఎందుకు విడగొట్టావు అని అడుగుతారు.  "నేను చెప్పుడు మాటలు విన్నాను. అందుకు చాలా మీ స్నేహాన్ని విడగొట్టినాను"అని గోపి అన్నాడు. 
"స్నేహం అనేది నమ్మకం, ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఉండాలి" అని ఇద్దరూ చెప్పారు.   "తన తప్పు తెలుసుకొని బాధపడి, నావల్ల మీ ఇద్దరికీ నష్టం కలిగింది. నన్ను క్షమించమని "గోపి అడిగాడు. 
మన మధ్య క్షమాపణలు ఏముంటాయి? మనం ఇకమీద స్నేహంగా ఉన్నాము. ఆనాటి నుండి వారు ముగ్గురు రాము సోము గోపి మంచి స్నేహితులుగా వున్నారు.
సృష్టిలో తీయనిది. స్నేహమే కదా అని స్నేహం ద్వారా సందేశం ఇస్తారు.
కామెంట్‌లు