త్రిజట ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 వాల్మీకి మహర్షి రిషి దృష్టి ప్రతిబింబాన్ని త్రిజట యొక్క పులకిత స్వప్నంలో స్పష్టంగా చూడవచ్చు రామాయణంలో  త్రిజట స్వప్నం  రహస్యాత్మకమూ ధన్యాత్మకమూ అయినటువంటి గొప్ప సంఘటన రాక్షసాంగనలో కూడా త్రిజటకు ప్రత్యేక స్థానం ఉంది అశోకవనంలో బందీగా ఉన్న సీతాదేవి రక్షణ కొరకు ఆమె కదలికలపై నిఘా కొరకు రావణుడు త్రిజటను నియమించాడు కానీ త్రిజట తన ఇతర రాక్షస స్త్రీల లాగా రాక్షస స్వభావి కాదు కులపరంగా రాక్షస వంశంలో జన్మించిన సంస్కార పరంగా ఆమె సాత్విక స్వభావురాలైన సదయ అందుచేతనే త్రిజట తన స్నేహితురాళ్లకు నచ్చచెప్పుతూ సీతాదేవికి ఊరట కలిగించేది రావణ పరివారంలో విభీషణుడు స్త్రీ పరివారంలో త్రిజట మూర్తిమంతులుగా నిలిచారు. అందుచేతనే తర్వాత వచ్చిన రామ కావ్యాల్లో త్రిజటను విభీషణుని కుమార్తెగా చూపించారు. రామాయణ సుప్రసిద్ధ వ్యాఖ్యాత గోవింద రాజ్ కూడా ఈ అభిప్రాయాన్ని మన్నిస్తాడు కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం త్రిజట స్పష్ట స్వరూపం జోతకం కాదు కానీ కథా నిర్మాణంలో త్రి జటను ప్రవేశపెడుతూ వాల్మీకి ఆమెను వృద్ధా మరియు ప్రబుద్ధా రాక్షసి అని అంటాడు దీనివల్ల ఆ ముసలి రాక్షసి వచ్చి నిద్ర నుంచి తక్షణమే మేలుకుందని అని భావించవచ్చు కొందరు విమర్శకులు ఈమె విభీషణుని కుమార్తె అనే విషయాన్ని ఖండించారు. ఆమె విభీషణుని కుమార్తె అయిన కాకపోయినా ఆమె వృద్ధ ప్రబుద్ధ అనే శబ్దాలలో స్థిరపడి ఉంది కనుక ఆమెను గురించి లోతుగా విశ్లేషించవలసిన ఆవశ్యకత ఏర్పడింది  హనుమంతునితో సంభాషించే సమయంలో సీతాదేవి కళ అనే పేరుతో ఉదాహరిస్తూ ఆమె విభీషణుని పెద్ద కుమార్తెగా చెపుతుంది సరమా అనే మరో పేరు గల స్త్రీ కూడా కనిపిస్తుంది ఆమె సీతాదేవి దుఃఖ సముద్రంలో ఉన్నప్పుడు సీతాదేవినే ఓదార్పు మాట్లాడుతూ  అనునయించినట్లుగా తెలుస్తోంది.ఇలా ఈ ముగ్గురి స్త్రీలలో త్రిజటకు ఒక విశిష్ట స్థానం ఉంది ఎందుకంటే త్రిజట తన స్వప్నంతో రాబోవు సంఘటనలను అన్నిటిని ప్రత్యక్షంగా చూడగలదు  స్వప్నంలో మంచి చెడులను స్నేహితురాంట్రకు తెలియజేసే ఉపద్రష్ట గానే కాకుండా ద్రష్ట యొక్క ఉన్నత భావాన్ని పుణికపుచ్చుకున్న భూమిక లోకి చేరిపోతుంది. దీనినే యోగ శాస్త్రంలో మధుమతి లేక విశోక భావ భూమికకు  సంధ్యగా నిలుస్తుంది.

కామెంట్‌లు