నేను పోరాడుతా ?!;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఇంకెంత కాలం
నాయన
మెడకు వ్రేలాడే
గుదిబండలా
ఈ నిరుద్యోగం

 పోటీ పరీక్షల పుస్తకం
ముందేసుకుని చదువుతుంటే
అమ్మానాన్న కష్టం గుర్తొచ్చి
గుండె చెరువై 
కన్నీటితో-- పుస్తకమంతా తడిసే


రాజ్యం 
మా బ్రతుకులతో--- దోబూచులాటాడుతుంది.
వారి ఎన్నికలకు వారి గెలుపుకు
మా నౌకర్లను ముడి పెట్టింది.

గంపెడు ఆకలిగొన్న
అన్నార్తులకు
పిడికెడు మెతుకులేసినట్టు
నిరసన నిప్పు మీద
నీళ్లు చల్లినట్టు
సావుగింజల్ని
పొలంలో అలికినట్టు
ఈ ఉద్యోగ ఖాళీలు

ఈ భూమ్మీద
 బ్రతకలేం?
ఇక్కడ బ్రతకడమంటే?
నిత్యం పస్తులతో
 సహవాసం చేయడమే!?


ఈ ఆకలి కేకలకు
నాలోఉత్పన్నమయ్యే
ప్రశ్నల పరంపరకు
శాశ్వత పరిష్కారం
ఒక్కటే ?
రాజ్యపు సవతితల్లి ప్రేమను
బజార్ల బట్టబయలు చేస్తా!?

తెలంగాణ
 నిరుద్యోగయువతంతా?
 తెగిడ్సికొట్లాడి తెలంగాణనే
తెచ్చుకున్నము

బ్రహ్మ చెవుడు నటించే
పాలకులకు తగుగుణపాఠం
చెప్పలేమా?!

నిరుద్యోగులు ఓ దండై? కదిలితే?
ఎవరు ఉద్యోగులు అవుతారో?
ఎవరి ఉద్యోగం ఊడుతుందో?
తెటతెల్లమైతది.

అమ్మాచదువు‌ఉద్యోగానికే
కాదే
 అయ్యచేసే ఉప్పరి పనిచేయడం కూడా ఆత్మగౌరవానికి ప్రతీకే 
అని
నేనంటా?!

ఇంత నారాజుగా ఉన్నడు?
నా కొడుకు అనుకోకే?

ఇన్ని రోజులు చదివి అయ్యచేసిన‌ పనే చేస్తుండనీ
బాధపడకే?
నేనేమన్నా దొంగ తనం చేయడంలేదు గదమ్మా  ?

కామెంట్‌లు