మేము భారతీయులం;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
 మేము భారతీయులం
భరతమాత ముద్దుబిడ్డలం
మేము భారతీయులం
శాంత స్వభావులం
మేము భారతీయులం
అజాతశత్రువులం
మేము భారతీయులం
వసుధైక కుటుంబ సభ్యులం
మేము భారతీయులం
సోదర సోదరీమణులం
మేము భారతీయులం
ఆసేతు హిమాలయ పర్వతాలు
దేశభక్తి పుణికిపుచ్చుకున్నవాళ్ళం
మేము భారతీయులం
దేశసేవకై అంకితమయ్యేవాళ్ళం
మేము భారతీయులం
నూటనలభైకోట్లు జనం
ఒక్కటైన చైతన్యం
మేము భారతీయులం
శాంతి పావురాలం
మేము భారతీయులం
వేదంవెలసిననేలనపుట్టిన
పుణ్యమూర్తులం
మేము భారతీయులం
రాముడు నడయాడిన 
పుణ్యస్థలాననడయాడేవాళ్ళం
మేము భారతీయులం
మేము ధన్యజీవులం
మేము భారతీయులం
దయాసముద్రులం

కామెంట్‌లు