మనసొక బొంగరం;- -గద్వాల సోమన్న,9966414580
మనసొక బొంగరం
విహరించే భ్రమరం
అదుపు తప్పినచో
అవుతుంది తిమిరం

మనసుతోన సమరం
ఉండును నిరంతరం
దాన్ని నియంత్రించ
అగును ఎవరి తరం!!

మనోవేగము చాలా
హద్దు చేయగ ఎలా!
దైనందిన ధ్యానము
అదే దాని సూత్రము

అదుపు లేని మనసులు
చేయు బ్రతుకు ఛిద్రము
దానితోడ భద్రము!
లేక మిగులు భస్మము

కామెంట్‌లు