సుప్రభాత కవిత ; - బృంద
మనసుతో దూరాన్ని 
కలలతో  కొలుస్తూ
కళ్ళ నిండా నింపుకుని 
చూపుల తివాచీ పరచి

ఎదసడికి దగ్గరగా ఉన్నా
కలవలేని దూరాన వుండి
తలపుల్లో తరిస్తూ
తరగని వలపుల జడికి తడుస్తూ

అంబరాన రంగులు చూసి 
సంబరంగా రేకులు విప్పి
హృదయనివేదన చేసి
ఉదయానికై ఎదురుచూస్తూ...

నింగితో పోటీగా రంగులెన్నో
తోటలో విరులుగా నింపి
పొంగే మనసున ఒదిగిన
ప్రేమను పొదివిపట్టుకుని

నిరీక్షణ ముగిసి నిండుగా
అపేక్షలన్నీ పండగా వేచిన 
అవనికి రక్షగా పండగై
బంగరు బంతిగా వచ్చిన

భాస్కరుని స్వాగతిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు