ఏమి వచ్చెనూ;-----జి.యాదయ్య '
 ఏమి వచ్చె ఏమి వచ్చె 
ఏమి వచ్చెనూ...!?
ఈదుకుంట ఈదుకుంట 
చేప వచ్చెనూ ...!?
ఏమి వచ్చె ఏమి వచ్చె 
ఏమి వచ్చెనూ...!?
ఉరుకుకుంట ఉరుకుకుంట 
ఉడుత వచ్చెనూ ...!?
ఏమి వచ్చె ఏమి వచ్చె 
ఏమి వచ్చెనూ...!?
పాకుకుంట పాకుకుంట 
పాము వచ్చెనూ...!?
ఏమి వచ్చె ఏమి వచ్చె 
ఏమి వచ్చెనూ...!?
ఎగురుకుంట...దుంకుకుంట 
కోతి వచ్చెనూ...!?
కోతి వచ్చికోతి వచ్చి
ఏమి చేసెనూ....
కోతి వచ్చికోతి వచ్చి ...
కొరికి పెట్టెనూ....
అటు వైపూ..ఇటువైపూ 
అరిచి పెట్టెనూ... 
దొరికిన ప్రతి వస్తువునూ 
విరిచి పెట్టెనూ ....
ఎదురొచ్చిన ప్రతి మనిషిని 
కరిచి పెట్టెనూ....
  కుర్రో- కుర్రు..
కామెంట్‌లు