చాణక్యపు మౌనధరుడు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 తెలంగాణ ముద్దుబిడ్డ 
మురిసింది భరతగడ్డ
రాజకీయ దురంధరుడు పీవీ 
చాణక్యపు మౌనధరుడు పీవీ
అష్టాదశభాషల గని పీవీ 
స్థితప్రజ్ఞతతో మసలిన ఖని పీవీ
ఎదిగినకొద్దీ ఒదిగిన పీవీ 
అపర వామనావతార కతన పీవీ
తెలంగాణ తేజోమూర్తి పీవీ  
భారతీయ నిత్యస్ఫూర్తి పీవీ
భరతమాత గుడిగోపురం పీవీ 
భారతీయ కీర్తిశిఖరం పీవీ
ప్రధానిపీఠం అధిరోహించిన పీవీ 
ఖండాంతరసీమలలో ఖ్యాతిగాంచిన పీవీ
ఆర్థిక సాంఘిక సంస్కరణలకాద్యుడు పీవీ 
ప్రభుత్వాన్ని నిలబెట్టిన నిరవద్యుడు పీవీ
తెలుగుసంప్రదాయాన్ని,భారతీయసంస్కృతిని, 
ప్రపంచప్రకృతిని త్రివేణీసంగమ క్షేత్రంగా 
మలిచి నిలబెట్టిన జ్ఞానపథం పీవీ!!!
**************************************
కామెంట్‌లు