336)అశోకః -
శోకములంటనివ్వని వాడు
స్థిరత్వమునీయగలవాడు
మనోనిబ్బరమునందించువాడు
దుఃఖములు తొలగించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
337)తారణః -
సంసారమును దాటించువాడు
కర్మలందు తోడున్నవాడు
ఫలితమును అందించినవాడు
తారణమును చూపగలవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
338)తారః -
తరింపజేయునట్టి వాడు
అన్నిటిని అనుసరించువాడు
గర్భజన్మములతోడున్నవాడు
జరామరణభయం తీర్చువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
339)శూరః -
అమితపరాక్రమ వంతుడు
వీరత్వము గలిగినట్టివాడు
ధీరునిగాను నిలిచినవాడు
శూరులలో ఎన్నదగినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
340)శౌరిః -
ఇంద్రియములనణిచెడి వాడు
బలవంతుడైనట్టి వాడు
మనోక్లేశముల తీర్చువాడు
బుద్ధివక్రతను హరించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి