మొక్కల విలువ_;- పుల్లగూర్ల సాయికృప, -ఏడో తరగతి,జి.ప.ఉ.పా.ఘనపురం, -తొగుట మండలం, సిద్దిపేట జిల్లా.
   అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో లహరి, సంయుక్త అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. సంయుక్త వాళ్ళ అమ్మానాన్నల పేర్లు సురేష్ సుశీల. లహరి వాళ్ళ అమ్మానాన్నల పేర్లు వరలక్ష్మి వంశీ. వీళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి స్నేహితులే. వీళ్ళ  నాన్నలు ఒకే ఆఫీస్ లో పనిచేసేవారు.
         సంయుక్త లహరికి మొక్కలు అంటే ప్రాణం.లహరి,  సంయుక్త వాళ్లకు ఉన్న కొద్దిపాటి స్థలంలో రోజు ఏదో ఒక మొక్క నాటేవారు. నాటిన మొక్కలను పెంచి పెద్ద చేసేవారు. మొక్కలను ప్రాణంలా చూసుకునేవారు. కొన్ని పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటారు. ఆ పూల మొక్కలు పండ్ల మొక్కలు పెద్దవై పూలు పూయడం, పండ్లు కాయడం మొదలయ్యాయి. అలా కొన్ని చెట్లు కాస్త తోట గా మారాయి.వాళ్ల తల్లిదండ్రులు ఎందుకమ్మా సమయం వృధా చేసుకుంటారు వాటి వల్ల మనకు ఏమొస్తుంది అనేవారు. అయినా వాళ్ళు ప్రయత్నాన్ని ఆపలేదు. ఈ చెట్లు మనల్ని ఎప్పటికైనా రక్షిస్తాయి అనేవారు...
      కొన్ని రోజుల తరువాత వీళ్ళ తల్లిదండ్రులు పనిచేసే ఆఫీస్ మూతపడింది. డబ్బులకు కష్టాలు మొదలయ్యాయి. అప్పులు చేయాల్సి వచ్చింది. వాళ్ల నాన్నలు ఒక దగ్గర కూర్చొని ఎలా అని బాధపడుతున్నారు. అప్పుడు లహరి మరియు సంయుక్త ఈ విషయం తెలుసుకొని వాళ్ల దగ్గరికి వెళ్లి  "నాన్న మీరు బాధపడకండి మేము కొన్ని చెట్లను పెంచుతున్నాం వాటికి పూలు, పండ్లు చాలా ఉన్నాయి. ఆ పూలను పండ్లను అమ్మి మనం సమస్యను తీర్చుకుందాం అని అనగానే  వాళ్ల తల్లిదండ్రులు సంతోషపడి పూలు పండ్లు మార్కెట్లో అమ్మి వాళ్ల కష్టాలను తీర్చుకున్నారు. సంయుక్త లహరి లను వాళ్ల తల్లిదండ్రులు చాలా మెచ్చుకొని వాళ్లు కూడా మొక్కలను పెంచడం ప్రారంభించి,వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్నారు...
నీతి:-  "వృక్షో రక్షతి రక్షితః"
    
కామెంట్‌లు