సాహితీ ధురీణ ఇంజనీరు రత్నలక్ష్మికి కవన రత్న బిరుదు పురస్కారం ప్రదానం
 వృత్తిలోనే కాదు ప్రవృత్తి లోను రాణిస్తూ సాహితీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగులీనుతోంది  తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. రత్నలక్ష్మి.  
సాయివనంలో సాహిత్యం (సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ) మరియు శ్రీ త్యాగరాయ గాన సభ హైదరాబాద్ వారి సంయుక్త నిర్వహణలో శ్రీమతి కొడుపుకంటి సుజాత కవన సంకలనం "సాహితీ నేస్తం" పుస్తకావిష్కరణ సందర్భంగా మంగళవారం కవి సమ్మేళనం నిర్వహించారు. నంద్యాలలోని జల వనరుల శాఖలో గల వృత్తిరీత్యా తెలుగుగంగ ప్రాజెక్టుకులో అసిస్టెంట్ ఇంజనీరు మరియు ప్రవృత్తి రీత్యా కవయిత్రియైన ఎస్. రత్నలక్ష్మి గారు ఈ కవి సమ్మేళనంలో ఓటరన్నా మేలుకో అనే కవితను గానం చేశారు. సాహితీ లోకంలో రత్నలక్ష్మి  తెలుగుభాషకు చేస్తున్న విశిష్ట సాహిత్య సేవలను, అవిరళ కృషిని, గుర్తించి మెచ్చి 27/2/2024న హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో (ప్రధాన కార్యదర్శి శ్రీ త్యాగరాయ గాన సభ) శ్రీమతి కొడుపుకంటి సుజాత, ముఖ్య అతిథి శ్రీ ఓలేటి పార్వతీశం (రిటైర్డ్ దూరదర్శన్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్) విశిష్ట అతిథి డాక్టర్ కావూరి శ్రీనివాస్ (శ్రీనాథ కవి సార్వభౌముడి వారసులు, కవి), ప్రముఖ కవి అవేరా, ప్రముఖ రచయిత్రి శ్రీమతి శశిబాల ఆధ్వర్యంలో ఎస్. రత్నలక్ష్మి యొక్క అనన్య ప్రతిభ పాటవాలను ప్రశంసిస్తూ కవన రత్న బిరుదుతో ఘనంగా సత్కరించి బంగారు పతకాన్ని గళసీమలో అలంకరించి, అందమైన జ్ఞాపికను మరియు కవన రత్న బిరుదు పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాహితీ మిత్రులు, ప్రముఖులు బంధుమిత్రులు ఎస్. రత్నలక్ష్మికి అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు