ఓ వనితా వందనం;- డా. అరుణ కోదాటి
సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే!
కానీ పురుషులలో  అహం,
నేనే  ఎక్కువ అని.

నిజానికి అతివలేని  పురుషుని  జీవితం అర్ధరహితం.

మగవాని జీవితంలో మగువ మధురభావన!

మానవ మనుగడలో మాధర్యం నింపి వెలుగునింపే దేవత,

పురుషుని వెనుక నిలపడి తగుసలహాలు ఇచ్చి విజయపధం లో నడిపే మార్గ దర్శి

ప్రకృతి వనరులను దేశాలను, పశు పక్ష్యా దులను, పరిసరాలను అన్నింటిని  స్త్రీ మూర్తిగా  భావించి నమస్కరించే సంస్కారం మనది

గంగా, యమున, సరస్వతి, ఇలా  పవిత్ర నదులకు  స్త్రీ మూర్తి పేరు పెట్టి 
పూజలు చేసే సంస్కారం  మనది  అంటే మనకున్న  ఆడవారికున్న  గౌరవం.

వేదకాలం నాటినుండే  మహిళలకు ప్రత్యేక స్థానం
ఇంటిబాధ్యతలు మొదలు ఇంటిల్లి పాది
ఒక స్త్రీ మీదనే ఆధారపడుతున్నారనే  విషయం  మరవొద్దు.
పురుషులతో సమానంగా  చదువుకుని అన్ని రంగాల్లో  ముందుకు వెళ్తున్నారనడం లో సందేహం  లేదు.

" అమ్మా! " అని పిలవబడుతూ,
అన్నింటా  విజయం  సాధించే 
శక్తి ఒక్క స్త్రీ కి మాత్రమే!

కొన్ని మూఢనమ్మకాలు, చాదస్తాలు
ఆడవారిని  చదువుల జోలికి పోనివ్వకుండా,

చేసి,
అబలగా చిత్రీకరించి బాల్యవివాహాలు,
వితంతువుగా  ఇలా మూఢ నమ్మకాలకు  బలిచేస్తే
ఆ ఉక్కుసంకెళ్ళను తెంపుకొని  బయటికొస్తే
నేటికాలంలో  అన్నింటా ముందై,
న్ని రంగాల్లో తానై   విజయశిఖరాన్ని  అందుకుంటుంటే,
అది చూసి ఓర్వలేని  పిశాచులు
ప్రేమ పేరుతో  లొంగతీసుకుని
మోసం చేయడం,
స్ట్రీ లసంపాదన  మోజుమీది ఆశతో
పెళ్లి అనే  ఉచ్చు బిగదీసి
మొగుని  పెత్తనం  చేయడం  విడ్డురం!

ఆడవారిని అణచి వేయాలనే  తన కనిపిస్తుంది .
నాటినుండి వేద వేత్తలు, మంత్ర
దర్శినిలు అనేకమంది,

గార్గి, గోద ఘోష, విశ్వపార, వేష, మాత్రు కర్షుక, బ్రహీజాయ, రొమాక, నృపాధితి,
శశ్వతి ఇలా  ఎందరో..!


స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తన ప్రతిభా
పాఠవాలు ప్రదర్శించారు.
దుర్గబాయ్ దేశ్ ముఖ్ లాంటి వీరమనులు దేశం కొరకు త్యాగం  చేసే వనితలు
ముఖ్యంగా  దేశ పౌరులను తీర్చి దిద్దే  గృహలక్షము లకు, అందుకే అన్ని రంగాల్లో విజయ పథకము ఎగరేస్తున్న వనితలందరికి  వoదనాలు 🙏💐

కామెంట్‌లు