సవ్యసాచి మహిళ;- కొప్పరపు తాయారు
అమ్మ పని  గొప్ప పని
అదనం ఉద్యోగం
ఒక ఒరలో రెండు కత్తులు
ఏదైనా సాధించగలదు

మహిళ తన సర్దుబాటు 
తన వెసులుబాటు 
ఇంటి బాగు ముఖ్యం
ఇంటి వారి ఆరోగ్యం

అందరి సంతోషం
సర్వం మహిళది
కావాలి ఆలోచన
ఉపాయం, చక్కని

చిక్కనైనా సర్దుబాటు
ఇది బాగుంటే పూలబాట
జీవితం ఊరేగు ఆనందాల
అద్భుతం అపురూపం

చాకచక్యం నైపుణ్యం
పుట్టుకతో వచ్చిన నిధులు
అందరిలో ఉంటూ అందరితో 
ఉంటూ నాదే నను భావంతో

చల్లని మనసుతో నడిపేది
చిన్నపిల్లలు వయసు మళ్ళిన 
పసిపిల్లలు, ఇద్దరూ సమానమే
కళ్ళల్లో వత్తులేసి కాపాడుకోవాలి

రోగాలు వచ్చిన , రొష్టులు
వచ్చిన దిద్దే ది సర్దేది ఆమె
అది ఆమె పద్ధతి .
పద్ధతిగా బతికితే

వెతుకులాట ఉండదు
జీవితానికి బరోసా
బాధ్యతలు అవలీలగా
 నిర్వర్తించొచ్చు, అప్పుడు

ఉద్యోగం చెయ్యొచ్చు
ఊళ్ళు ఏలొచ్చు
అమ్మ తనంలో గొప్పతనం
ఓర్మి, సర్దుబాటు పద్ధతైన

నడత చాలా ముఖ్యం
అందరూ తనవారే
తనవారికై తన జీవనం
తలచు స్త్రీ రెండింటిలో
విజయ ఢంకా మ్రోగించు !!!
కామెంట్‌లు