వీ డ లే డు కదా.... ! #- కోరాడ నరసింహా రావు..!
ఛావటానికైనా సిద్ద పడక పోతే
 మనిషికి బ్రతుకు లేదు...! 
 ఇది ఈ మానవజన్మ దుష్తితి.!! 

బ్రతుకు కోసం ఆది నుండి... 
 ఈ నాటికీ తప్పని అగచాట్లు.! 
  ఇవి ఏ నాటికీ తప్పవేమో..!! 

ఎదురైన కష్టాలనన్నీ ... 
    సుఖాలుగా మలచుకోగల... 
ఈమేధాావిమనిషికిఎందుకిలా! 

సంచార జీవితానికి స్వస్తి చెప్పాడే..., 
 స్థిర నివాసాలనుఏర్పరచుకో గలిగాడే..., 
 తృణ దాన్యా లను పండిస్తున్నాడే..., 
 మట్టిని బంగారంగా.. 
   మర్చగలిగే మేధాావి యైన
     ఈ మనిషికి... 
 సుఖపడటంలో.. ఎన్నో... 
  ఎన్నెన్నో విజయాలను సాధించి... 
 సకల ప్రాణి కోటిలో సాటిలేని మేటి అనిపించు కున్న 
  ఈ మనిషికా  ఈ  దుస్తితి?! 

ఇన్నిన్ని తెలుసుకున్నఈమనిషి
 ఇతరులను సుఖ పెట్టటంలోనే
 తనసుఖముందన్న ఈసూక్ష్మాన్ని 
 తెలుసుకోలేక సాటి వారిని,తోటివారిని 
బాధపెట్టి తను సుఖ పడాలను కోవటం 
  విడ్డూరమే కదూ..!! 

సుఖ, భోగ, లాలసతతో.... 
 హీనుడై పోయిన మనిషికి... 
  ఎంత చదువు చదివినా.... 
 ఎన్నెన్ని మంచిమాటలు విన్నా
 వాడి అవగుణమును... 
 వాడు వీడ లేడు కదా......!! 
       *******
కామెంట్‌లు