అన్నం మొదటి బ్రహ్మ;- " కావ్యసుధ ''
 ఉపనిషత్తులలో ఒక కథ ఉంది. ఉద్దాలక ఋషి కుమారుడు. గురువు ఆశ్రమంలో విద్య ఆర్జించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆశ్రమం లో తను నేర్చుకున్న వేదాంతం. బ్రహ్మజ్ఞానం గురించి ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒకటి చెబుతూనే ఉండేవాడు.
మాటిమాటికి 'బ్రహ్మము' గురించి చెబుతుండే వాడు. కొడుకు ఈ విధంగా జ్ఞానం ప్రదర్శిస్తుంటే ఉద్దాలక ఋషి విని నవ్వుకునేవాడు.
ఒక రోజున కొడుకు అడిగాడు-"మీరెందుకు నవ్వుతారు?" అని,
తండ్రి-"కొన్నాళ్లయిన తర్వాత చెబుతాను. నువ్వు పదిహేను రోజులపాటు ఉపవాసం చెయ్యి" అన్నాడు.
కుమారుడు ఉపవాసం ప్రారంభించాడు. ఉపవాసం మూడవ రోజున తండ్రి అడిగాడు -"నువ్వు ఏమిటి ఆలోచిస్తున్నావు?" అని.
"ఆకలి గురించే నా ఆలోచన. అన్నం తప్ప మరొకటి ఆలోచన్లోకి రావటంలేదు" ఏడవ రోజున కూడా తండ్రీ కొడుకుల మధ్య ఇలాంటి సంభాషణే జరిగింది. కొడుకు అన్నం తప్ప మరొకదాన్ని గురించి చెప్పలేదు.
పదిహేనవ రోజు కూడా తండ్రి ఇదే ప్రశ్న అడిగే సరికి-"నేను ఏమాలోచిస్తున్నానని మాటిమాటికి అడుగుతున్నారెందుకు? నాకు ఆకలి తప్ప మరొక ఆలోచన లేదు. అన్నం గురించే ఆలోచిస్తున్నాను"
తండ్రి అడిగాడు-"ఏం బ్రహ్మ గురించిన ఆలో చనలు రావడంలేదా?"
"బ్రహ్మా! పదిహేను రోజులుగా అలాంటి ఆలో చర్చా రాలేదే"
అప్పుడు తండ్రి నవ్వుతూ కొడుక్కి నచ్చజెపా డు"అన్నం మొదటి బ్రహ్మ. ఇదే నేను నీకు నేరే విద్య" అని.ఆకలి దప్పిక, సుఖం దుఃఖం.శీతోష్టాలు-వంట ద్వంద్వాలను అధిగమించనంతవరకు బ్రహ్మ సాక్షర త్కారం లభించదు. ఆ ద్వంద్వాలలో వున్నంతి కాలం పదే పదే బ్రహ్మము గురించి వాదించడంవల్ల ప్రయోజనంలేదు. మనం గ్రహించే అన్నపానాదులే పరబ్రహ్మ స్వరూపంగా భావించి, దేహధర్మాల్ని నిర్వర్తిస్తూ వుంటే, క్రమంగా 'సర్వం బ్రహ్మమయంగా  సాక్షాత్కరిస్తుంది.
" కావ్యసుధ ''
''ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్"
 హైదరాబాద్ = హయత్ నగర్
కామెంట్‌లు