సుప్రభాత కవిత ; - బృంద
చీకటిలో చింతలే కాదు
మనతో మనం గడిపే
ఏకాంతం ఉంటుంది.

పొరలు కప్పిన జ్ఞాపకాలు
తాళం వేసిన తలపులు
దరి చేరని మమతలు
నొప్పించిన గతాలు

కలగా గడచిన బాల్యం
వెల్లువైన సంతోషం
కలతలెరుగని ప్రాయం
కమ్మని ఊహల ఉత్సాహం

ఎన్నో అపురూప క్షణాలు
ఆప్యాయత నిండిన 
ఆలింగనాలు

రోజుకో పొరతీసి..కొత్తగా 
తలచుకుని సరి కొత్తగా
ఉత్తేజం నింపుకుని..

తప్పుల గుణపాఠాలు
తప్పని బాధ్యతలు
ఒప్పని విషయాలు అన్నీ..

పలకరించి పోయే
చీకటి రాత్రి వెడుతూ
పంచిపోయిన ఆనందం

వెల్లువైన వెలుగులో
తెల్లవారగానే తేలిపోయి 
పరుగులు మొదలయే 

పండగంటి వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు