కవితలకు స్వాగతం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితలు
పుట్టాలోయ్
మనసులు
తట్టాలోయ్

కవితలు
పారాలోయ్
మదులు
మునిగితేలాలోయ్

కవితలు
కురవాలోయ్
మేనులు
మురియాలోయ్

కవితలు
మెరవాలోయ్
కళ్ళను
కట్టిపడవేయాలోయ్

కవితలు
పండాలోయ్
కడుపులు 
నింపాలోయ్

కవితలు
పుయ్యాలోయ్
పరిమళాలు
వెదజల్లాలోయ్

కవితలు
పొంగాలోయ్
ఎదలు
ఎగిరిగంతులెయ్యాలోయ్

కవితలు
పాడాలోయ్
హృదయాలు
ఊగించాలోయ్

కవితలు
కుమ్మరించాలోయ్
తనువులు
తడిసితన్మయత్వంపొందాలోయ్

కవితలు
రావాలోయ్
కల్మషాలు
కడగాలోయ్

కవితలు
చదవాలోయ్
కమ్మదనము
పొందాలోయ్

కవితలు
వండాలోయ్
షడ్రుచులు
వడ్డించాలోయ్

కవితలు
పంచాలోయ్
కులుకులు
కలిగించాలోయ్

కవితలు
పఠించాలోయ్
కవులను
తలచాలోయ్

కవితలను
స్వాగతించాలోయ్
కవులకు
సుస్వాగతంపలకాలోయ్

కామెంట్‌లు