సామ్రాజ్ఞి; - డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాదు.
 తానొక దుర్గం
తానొక ఖడ్గం
పరిమళాల సుగంధం
పొదరిల్లుల స్వర్గం
ఇల్లంతా సందడి
తనదే హడావుడి
బాధ్యతకు పెట్టింది పేరు
బంధానికి గొలుసుకట్టు
గడియారపు ముల్లులా
గదికి పెట్టిన గొళ్ళెంలా
పటిష్ఠమైన అమరిక
చిరునవ్వుల దేవతలా
అమృతమందించు అమ్మలా
తన ఉనికే నిలయం
తన పలుకే మంత్రం
గుమ్మం లోపలి రాణి
గృహసామ్రాజ్యానికి పట్టమహిషి
ఇంతియే ఇలలోని ఈశ్వరి
సాటిరాదు మరేది నీకు
చిరంజీవియై ఉండు
సర్వవ్యాపివై వెలుగొందు.
కామెంట్‌లు